తల్లిదండ్రులను గౌరవించడం ( పోషించడం ) పిల్లల బాధ్యత
- పిల్లలుగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి
- మీరు ఇప్పుడు తల్లులు, తండ్రులు, ఒకప్పుడు మీరు పిల్లలే
తల్లిదండ్రులను గౌరవిస్తూ పోషించడం పిల్లల యొక్క బాధ్యత అని ఈరోజు పిల్లలు ( కోడలు, కొడుకు ) కొందరు మర్చిపోతున్నారు. పిల్లలు పెరిగి పెద్దయి పెళ్లిళ్లు కాగానే తల్లిదండ్రులు పరాయి వారు అన్నట్లుగా మెలగడం ఈరోజుల్లో పెళ్లయిన పిల్లలకు ఫ్యాషన్ గా మారింది. వారు పెరిగి పెద్దయి పెళ్లయ్యే వరకు, ఉద్యోగాలు వచ్చి స్థిరపడే వరకు తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని కొందరైనా గుర్తుంచుకోవడంలేదనేది జగమెరిగిన సత్యం. ఉద్యోగాలు వచ్చి తల్లిదండ్రులకు దూరంగా వెళ్లవలసి వస్తే కొందరు నెలనెలా తల్లిదండ్రులకు కొంత డబ్బులు పంపిస్తూ ఫోన్లు చేస్తూ మాట్లాడిస్తూ ఉంటారు. మరికొందరు మాకే డబ్బులు సరిపోవడం లేవంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కొడుకులు నా తల్లిదండ్రుల అవస్థలు మాత్రం ఇంత అంత కాదు, వాడు ఒక నెల వేడుకనిలా అంటూ వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆర్థికంగా అన్ని విధాలుగా ఉన్నవారు, తల్లిదండ్రులను తీసుకువెళ్లి అనాథ శరణాలయంలో ఉంచుతూ నెలకు 10,000, 20,000 రూపాయలను ఇస్తూ తీరిక సమయాల్లో వెళ్లి పలకరించి వస్తున్నారు. దీనివల్ల వారి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురి అవుతున్నారో, పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చిన తమ పిల్లలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే వారు పిల్లలకు పలు సూచన సలహాలు ఇస్తారు, కానీ పిల్లలు మాత్రం వాటిని పట్టించుకోవడం అటు ఉంచి చీదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల వల్ల కొందరు ఆర్థికంగా ఎదిగిన, కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంట్లో భార్యతో గొడవలు పడుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి అన్నిటికీ కారణం ఒకటే ఉమ్మడి కుటుంబలు లేకపోవడం, పెరుగుతున్న పిల్లలకు సరైన అవగాహన కల్పించకపోవడం, పెద్దలంటే గౌరవాన్ని చిన్నప్పటినుండే ఇచ్చే విధంగా పిల్లలను పెంచితే పెరిగిన తర్వాత ఈ సమస్యలు ఏవి ఉండవు.
మీ పిల్లలను మీరు పెంచుతున్నట్లే, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెంచారు
ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఏది కావాలంటే అది కొనిస్తూ వారిని అధిక గారాబం చేస్తూ పెంచుతున్న తల్లిదండ్రులు, వారి చిన్నతనంలో వారిని కూడా వారి తల్లిదండ్రులు ఇలాగే పెంచారని ఒక్కసారి ఆలోచన చేస్తే తల్లిదండ్రులను వదిలి ఏ పిల్లలు ఉండలేరు. ప్రస్తుత సమాజంలో అంతగా ఆలోచించే సమయం, ఓపిక, ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఎవరికి దొరకడం లేదు, దీంతో వారు ఏం చేస్తున్నారో వారికి తెలువకుండా పోతుంది, వారిని కానీ పెంచిన తల్లిదండ్రుల గురించి కాసింత ఆలోచన చేసే సమయం కూడా లేకపోవడం, ఈ మొబైలు వచ్చినప్పటినుండి పక్కవారితో సైతం మాట్లాడానికి వారికి సమయం దొరకడం లేదు, ఇక తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ దొరుకుతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తే వారి గురించి వారి పిల్లలు ఆలోచన చేస్తారని ఆలోచనలో ఉంటే బాగుంటుంది అనేది నిజం.
It is a long established fact that a reader will be distracted.
There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour.
Add my business arrow_forwardCopyright © 2024 upayog . Proudly powered by Rn53Themes.net